సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేట పట్టణంలో సంచార జాతుల షాపులను ఆదివారం గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారు. వీటిని తగలబెట్టింది ఓ పలుకుబడి కలిగిన వ్యక్తే అని వారు అనుమానిస్తున్నారు. దుకాణాలు తగల పడటంతో సంచార జాతుల వారు వీధిన పడ్డారు. ఇలా తమ గుడిసెలను తగలబెట్టడం ఎంతవరకు సమంజసమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.