బంగాళఖాతంలో అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో సూళ్లూరుపేట డివిజన్ పరిధిలోని ఆర్డీఓ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ 08623 - 295345 నంబర్ ఏర్పాటు చేయడం జరిగిందని ఆర్డీఓ కిరణ్మయి బుధవారం తెలియజేశారు. తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున డివిజన్ కేంద్రంతో పాటు అన్ని తహశీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు గమనించాలని కోరారు.