సూళ్లూరుపేట పట్టణంలోని పోలీస్ స్టేషన్ లో కొత్త చట్టాలతో పాటు సోషల్ మీడియాకు సంబంధించిన నేరాలపై సోమవారం అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో డీఎస్పీ చెంచు బాబు, ఏపీపీ ప్రకృతి కుమారులు పాల్గొని చట్టాలపై పలు విషయాలను వివరించారు. చట్టాలకు ఎవరూ చుట్టాలు కాదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీఐ మురళీకృష్ణతో పాటు ఎస్ఐలు ఉన్నారు.