సూళ్లూరుపేట మున్సిపల్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి అతిథిగా ఎమ్మెల్యే విజయశ్రీ పాల్గొన్నారు. పట్టణంలో రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ సమస్యలపై స్థానిక ప్రజలు ఎమ్మెల్యే నెలవల విజయశ్రీకి ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల సమస్యలు పెరిగాయని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చిన్నయ్య, అధికారులు పాల్గొన్నారు.