3, 4న ఎర్రగుంట్ల గంగమ్మ జాతర

75చూసినవారు
తంబళ్లపల్లెకు సమీపంలో శివపురం రోడ్డులో ఎర్రగుంట్ల గంగమ్మ జాతరను జూలై 3, 4న వైభవంగా నిర్వహిస్తున్నట్టు గ్రామస్తులు తెలిపారు. దండోరాతో జాతరకు ఆదివారం చాటింపు వేశారు. బుధవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి జాతర ప్రారంభిస్తారు. తెల్లవారుజామున అమ్మవారికి మహిళలంతా కలసి సామూహికంగా దీలు, బోనాలు సమర్పిస్తారు. ఆలయం వద్ద భక్తులకు అన్నదానం చేస్తామని నిర్వాహకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్