బి. కొత్తకోట స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ దనుంజుయులుకు మొరుసుకాపు(ఒక్కలిగర) సంఘం తరుపున సోమవారం వినతిపత్రం అందచేశారు. ఈ సందర్బంగా పలువురు మొరుసుకాపు సంఘం సభ్యులు తహసీల్దార్ తో మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చినటువంటి 33 జీవో ప్రకారం తంబళ్లపల్లె నియోజక వర్గంలో ఉండే మొరుసుకాపు కుటుంబాలకి బీసీ బి కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని అని కోరారు. ప్రభుత్వ జీవో 33 అమలులోకి వచ్చి నాలుగు సంవత్సరాల అవుతున్నా కూడా ఇoతవరకు ఇవ్వకపోవడoతో తంబళ్లపల్లి , మదనపల్లి నియోజకవర్గాల్లో ఉండే ప్రతి మొరుసుకాపు కుటుంభం లోను విద్యా పరంగా, ప్రభుత్వ పథకాలు పరంగా ఎన్నో కోల్పోయాము అని తెలియజేసారు.
కర్ణాటక , తమిళనాడు, ఉమ్మడి అనంతపురం జిల్లా లో ఉండే మొరుసుకాపులు బీసీ కేటగిరి లో ఇప్పటికే ఉన్నారనీ తెలిపారు. అనంతపురం లో అమలులో ఉన్న ఈ జీవో ని ఉమ్మడి చిత్తూరు జిల్లా కి వర్తిoపు చెయ్యాలని ఆ జీవో లో వున్న కూడా ఆ జీవో ప్రకారం కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో బీసీ బి సర్టిఫికెట్స్ తీసుకుంటూ ఉంటే ఇక్కడ ఇవ్వకపోవడం చాలా అన్యాయం అని ఈ సందర్బంగా తహసీల్దార్ కు తెలియచేసారు. ఈ సమస్య ని ఉన్నతాధికారులకి తెలియజేసి మీ సమస్య ని పరిస్కారానికి కృషిచేస్తానని మొరసు కాపు సభ్యులకు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో రమేష్ రెడ్డి, దాదం లోకనాథ్ రెడ్డి, గుడిపల్లి సర్పంచ్ గిరిజా రఘునాథ్ రెడ్డి, తుమ్మనగుట్ట సర్పంచ్ రుక్మిణి అమరనాథ్ రెడ్డి, గోల్లపల్లి సర్పంచ్ విజయభాస్కర్ రెడ్డి, వేమిలేటికోట సర్పంచ్ రవీంద్ర రెడ్డి, టి. సదుం ఉప సర్పంచ్ మధుకర్ రెడ్డి, కుమ్మరపల్లి మనోహర్ రెడ్డి, గుడిపల్లి ఆదిశేఖర్రెడ్డి, శంకర్ రెడ్డి, కమ్మాలపల్లి శంకర్ రెడ్డి, చండ్రమాకులపల్లి మధుకర్ రెడ్డి, శెట్టిపల్లి కి చెందిన కృష్ణారెడ్డి, పాలు శ్రీనివాసులు రెడ్డి, వెంకటరమణ రెడ్డి, సురేంద్ర రెడ్డి, కే. శ్రీనివాసులు రెడ్డి, గుంతురూ వెంకటరమణ రెడ్డి, మల్లెల మధుకర్ రెడ్డి, ఈశ్వరమ్మ, నందిశెట్టివీదికి చెందిన చిన్నపరెడ్డి, మాధవరెడ్డి, రామచంద్ర రెడ్డి, ఈశ్వర్ రెడ్డి, మొరవపల్లి మోహన్ రెడ్డి, చెన్నరాయనిపల్లి ఈశ్వర్ రెడ్డి, పకృల్లా ఖాన్ తదితరులు పాల్గొన్నారు.