
తంబళ్లపల్లి: "ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోండి"
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని తమకు నచ్చిన నాయకులను ఎన్నుకొని ప్రజాస్వామ్యానికి ఊపిరి పోయాలని తాహశీల్దార్ హరికుమార్ కోరారు. శనివారం జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా క్రాస్ రోడ్లో సీనియర్ సిటిజన్లను తహసిల్దార్ సత్కరించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందాలనిలని సూచించారు. ఈకార్యక్రమంలో ఆర్ఐ ముద్దుకృష్ణ, సర్వేయర్ నరేంద్ర, రెవెన్యూ అధికారులు, వీఆర్వోలు, రాజకీయ పార్టీ నాయకులు, ప్రజలు, ఓటర్లు పాల్గొన్నారు.