పుంగనూరు మండలం రాంపల్లి కు చెందిన భవన కార్మికుడు మునిరాజా(40) నడిచి వెళుతుండగా కారు ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. గురువారం పుంగనూరులో భవన నిర్మాణం పనులు ముగించుకొని ఆటోలో రాంపల్లి కి వెళ్లాడు. అక్కడ రోడ్డు ప్రక్కన నడుచుకుని ఇంటికి వెళుతుండగా పుంగనూరు నుండి మదనపల్లి కి వెళుతున్న కారు ఢీకొని వెళ్లిపోయింది. తీవ్రంగా గాయపడ్డ అతన్ని 108 వాహనంలో మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.