కలిచర్ల దర్గా వివాదం.. ఇద్దరు నిందితులు అరెస్ట్

61చూసినవారు
కలిచర్ల దర్గా వివాదం.. ఇద్దరు నిందితులు అరెస్ట్
పెద్దమండెం మండలం కలిచర్ల దర్గా వివాదంలో ముగ్గురిపై కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు ఆదివారం ఎస్ఐ రమణ తెలిపారు. కలిచర్లలో మౌలాకా పహాడ్ ఉరుసు జరపాలని ప్రయత్నిస్తుండగా.. కడప పెద్ద దర్గా పీఠాధిపతి అరీఫుల్లా హుసేని వర్గీయులతో.. కలిచర్ల గురువు వర్గీయులు అన్వరుల్లా, అమీర్, చాను దుర్భాషలాడారని తెలిపారు. కడప దర్గా మేనేజర్ అలీఖాన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్