పెద్దతిప్ప సముద్రం మండలం మడుమూరు పంచాయతీలో శుక్రవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభించి గ్రామ వీధుల్లో మూడు టన్నుల పూలను పరిచి ప్రతి ఇంటి దగ్గర హారతులు ఇచ్చి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారనాథరెడ్డి కి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి సర్పంచులు భాస్కర్ నాయుడు, శ్రీదేవి రామకృష్ణ , పూల గిరీష్ , ఎంపీపీ మహమ్మద్, జడ్పిటిసి శివన్న తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలు ఏమైనా ఉన్నాయా అని ఎమ్మెల్యే ప్రజల దగ్గర వాకబు చేశారు.