తిరుమలలో వరుస ప్రమాదాలు భక్తులను కలవరపెడుతున్నాయి. తాజాగా రెండో ఘాట్ రోడ్డులో ఓ బస్సు ప్రమాదానికి గురైంది. డివైడర్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. బస్సు ప్రమాదంతో అలిపిరి వరకు వాహనాలు నిలిచిపోయాయి. క్రాస్ బారియర్ పటిష్టంగా ఉండటంతో ప్రమాదం తప్పిందని లేదంటే బస్సు లోయలో పడి ఉండేదని భక్తులు చెబుతున్నారు.