తిరుమలలో ప్రక్షాళన ప్రారంభమైందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. తిరుమలకు వచ్చే భక్తులు ఇప్పుడు సంతృప్తిగా ఉన్నారు అని చెప్పారు. కేంద్రం సమన్వయంతో ఏపీ అభివృద్ధిలో ముందుకు సాగిందని, 4 నెలల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. అమరావతి, పోలవరానికి నిధులు మంజూరు అయినట్టు పేర్కొంటూ, ఏపీ అభివృద్ధికి మోదీ సహకరిస్తున్నారని తెలిపారు.