తిరుపతి జిల్లా వడమాలపేట మండలం అప్పలాయగుంట శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జరుగుతున్న పవిత్రోత్సవాల్లో భాగంగా ఆదివారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ చేపట్టారు. ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాలసేవ, అర్చన నిర్వహించారు. యాగశాలలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసస్న వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం వేడుకగా చేపట్టారు. ఆ తరువాత పవిత్ర సమర్పణ నిర్వహించారు.