తిరుపతి నగరానికి నీటి సరఫరా చేసే తెలుగు గంగ హెడ్ వాటర్ వర్క్స్ మెయింటెనెన్స్ వలన మంగళవారం నగరంలోని కొన్ని వార్డుల్లో త్రాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్. మౌర్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మంగళం పంపింగ్ ష్టేషన్ నుండి మంగళం ఫిల్టరేషన్ ప్లాంట్స్ వరకు గల 1200 యం. యం. డయా పంపింగ్ మెయిన్ నందు ఆర్టీసీ డిపో దగ్గరలో పైపులైను డ్యామేజి అయ్యిందని తెలిపారు.