చిత్తూరు జిల్లా పెనుమూరు శ్రీ కమలాంబికాదేవి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 23వ తేదీ మంగళవారం శ్రీ కమలాంబికా దేవి అమ్మవారికి నూతనంగా తయారు చేయబడిన రజత కవచముచే అలంకారము నిర్వహిస్తారని ఆలయ ప్రధాన అర్చకులు గుంటూరు తారకరామ శర్మ సోమవారం తెలిపారు. ఆలయంలో ఉదయం ఏడు గంటలకు అభిషేకం నిర్వహిస్తారని కావున భక్తాదులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ప్రధాన అర్చకులు కోరారు.