వయనాడ్ ఉప ఎన్నిక పోలింగ్ మరో రెండు రోజుల్లో జరగనుంది. అయితే ఎంపీ ఉప ఎన్నిక బరిలో ఇద్దరు ఏపీ వ్యక్తులు కూడా ఉన్నారు. తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం దేవరకొండకు చెందిన దుగ్గిరాల నాగేశ్వరరావు పోటీ చేస్తున్నారు. నాగేశ్వరరావు జాతీయ జనసేన పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. అలాగే ఏపీకి చెందిన మరో వ్యక్తి షేక్ జలీల్ నవరంగ్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీలో ఉన్నారు. ఇద్దరు తెలుగు వ్యక్తులు పోటీ చేయడం ఆసక్తికరంగా మారింది.