నూతన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రజలకు అందుబాటులోకి పారదర్శకంగా ఇసుక అందేలా, ప్రభుత్వానికి ఇసుక ద్వారా ఎలాంటి ఆదాయం ఆశించకుండా పలు చర్యలు చేపట్టిందని, ఇసుక అక్రమ రవాణాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ అన్నారు. మంగళవారం సాయంత్రం తిరుపతి కలెక్టరేట్ లో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం కలెక్టర్ ఎస్పీ సుబ్బరాయుడు, జెసి శుభం బన్సల్ లతో కలిసి నిర్వహించారు.