తిరుపతి రూరల్ మండల పరిధిలో రాజకీయ నేతలు పేరు చెప్పి భూదందాలు చేస్తున్నారని బాధితులు వాపోయారు. వారి వివరాల మేరకు. తిరుపతి రూరల్ మండలం శ్రీనివాసపురం పంచాయితీలో మా 22మందికి స్థలాలు ఉన్నాయి. వీటిని కొందరు కబ్జా చేసి భయబ్రాంతులకు గురి చేస్తున్నారని వాపోయారు. గతంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఆయన తనయుడు పేరుతో ఇప్పుడు తిరుపతి ఎమ్మెల్యే, ఆయన సోదరుడి కుమారుడు శివ చెప్పి బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.