వెంకటగిరి: గుంతలను తప్పించబోయి ప్రమాదానికి గురైన లారీ

72చూసినవారు
తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గం బాలయపల్లి మండలం పెరిమిడి గ్రామ సమీపంలో శనివారం సిమెంట్ బస్తాలతో వెళ్తున్న లారీ ప్రమాదానికి గురైంది. ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో ప్రమాదం తప్పింది. స్థానికుల సమాచారం ప్రకారం కలవకూరు గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణ పనుల కోసం సిమెంట్ తరలిస్తున్న వాహనం పెరిమిడి గ్రామ సమీపంలో భారీ గుంతలను తప్పించబోయి ప్రమాదానికి గురైందని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్