11 రోజుల తర్వాత సచివాలయంలో అడుగుపెట్టిన సీఎం చంద్రబాబు

72చూసినవారు
11 రోజుల తర్వాత సచివాలయంలో అడుగుపెట్టిన సీఎం చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు 11 రోజుల అనంతరం మళ్లీ సచివాలయంలో అడుగుపెట్టారు. విజయవాడలోని వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యల పర్యవేక్షణ కోసం ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరేట్‌లోనే పది రోజులుగా సీఎం బస చేశారు. ప్రస్తుతం వరద ముంపు నుంచి ఆ ప్రాతం కొద్దిగా కోలుకోవటం, బాధితులు తిరిగి తమ ఇళ్లకు చేరుకోవడంతో పాటు అన్ని చోట్లా సాధారణ స్థితి నెలకొనడంతో ఇవాళ సచివాలయానికి వచ్చి అధికారులతో సమీక్ష నిర్వహించారు. సచివాలయానికి వచ్చిన సీఎం.. వరద సహాయక చర్యలపైనే అధికారులతో సమీక్షించారు.

సంబంధిత పోస్ట్