ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి శాంతినగర్ వద్ద బుడమేరుకి మూడు చోట్ల గండ్లు పడిన విషయం తెలిసిందే. వరద ఉధృతి తగ్గడంతో ఇరిగేషన్ అధికారులు గండ్లు పూడుస్తున్నారు. ఈ కార్యక్రమాలను పర్యవేక్షించాల్సిందిగా మంత్రి నారా లోకేష్‌కు సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ మేరకు గండ్లు పూడ్చివేత పనులకు పర్యవేక్షించేందుకు బుడమేరు వద్దకు నారా లోకేష్ బయలుదేరి వెళ్లారు.