AP: రాయలసీమ రైతులకు చివరి ఎకరం వరకు సాగు నీరు అందిస్తామని మంత్రి నిమ్మల రామనాయుడు వెల్లడించారు. విజయవాడలోని ఇరిగేషన్ క్యాంప్ ఆఫీస్‌లో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'గత ఐదేళ్ళు హంద్రీనీవా ప్రాజెక్టును గాలికొదిలేసి రైతాంగానికి వైఎస్ జగన్ తీరని అన్యాయం చేశారు. అధికారంలోకి వచ్చాక రూ. 2629 కోట్లతో హంద్రీనీవా ప్రాజెక్టు పనులు పునః ప్రారంభించాం. త్వరలోనే ప్రాజెక్టు పనులు పూర్తి చేసి.. రైతులకు నీరందస్తాం' అని అన్నారు.