తిరుమల తిరుపతి దేవస్థానం వైకుంఠ ద్వార దర్శనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పది రోజులు ఈ దర్శనాలు ఉంటాయని, ఈనెల 10న ఉదయం 4.30గం. నుంచి ప్రోటోకాల్ దర్శనాలు, 8గం. నుంచి సర్వదర్శనం, 9 – 11గం. వరకు స్వర్ణరథం దర్శనాలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. టోకెన్లు ఉన్న వారికే అనుమతి అని తెలిపారు.