ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బీసీలకు శుభవార్త చెప్పారు. సోలార్ విద్యుత్ వినియోగాన్ని పెంచడమే లక్ష్యంగా కేంద్రం ‘పీఎం సూర్యఘర్’ పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకునే వారికి కేంద్రం రూ.60వేలు దాకా సబ్సిడీ ఇస్తుంది. అయితే ఈ పథకం కింద బీసీలకు కేంద్రం ఇచ్చే రాయితీకి అదనంగా మరో రూ.20వేలు సబ్సిడీ అందించనున్నట్లు చంద్రబాబునాయుడు తెలిపారు. దీంతో బీసీలకు దాదాపు రూ.80వేల వరకు సబ్సిడీ అందనుంది.