మంత్రి ఫరూక్‌ను సీఎం చంద్రబాబు పరామర్శించారు. ఫరూక్ సతీమణి షెహనాజ్ గురువారం మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చంద్రబాబు హైదరాబాద్‌లోని ఫరూక్ ఇంటికెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పారు. భార్య మృతికి గల కారణాలను అడిగి తెలుసుకొని ఫరూక్‌ను ఓదార్చించారు. సీఎం వెంట మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ఇతర నాయకులు ఉన్నారు.