గుజరాత్‌లోని భరూచ్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. అంకాలేశ్వర్ పట్టణంలో రోడ్డు పక్కన నిల్చొని ఉన్న ఇద్దరు యువతులను ఓ కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ యువతి అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి కంటైనర్ డ్రైవర్ అతివేగమే కారణంగా తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.