సీఎం చంద్రబాబు కోటప్పకొండలోని త్రికూటేశ్వర స్వామి వారిని దర్శించుకొని పూజలు చేశారు. పల్నాడు జిల్లా యల్లమందలో పేదల సేవలో పాల్గొని అక్కడి నుంచి కొండకు చేరుకున్నారు. ఆలయం వద్ద దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, జమిందార్ రామకృష్ణ కొండల రావు, దేవాదాయ సెక్రటరీ సత్యనారాయణ వేదపండితులు ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. చంద్రబాబుతోపాటు ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్,ఎం.పి. శ్రీ కృష్ణ దేవరాయలు ఇతర అధికారులు ఉన్నారు.