తిరుమలలో 2025 జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు. 10 రోజుల పాటు సాగే వైకుంఠ ద్వార దర్శనాల కోసం టీటీడీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. జనవరి 10, 11, 12 తేదీల్లో వైకుంఠ ద్వార దర్శనం కోసం జనవరి 9న టోకెన్లు జారీ చేస్తారు. ఇక మిగిలిన రోజుల్లో (13 నుంచి 19 వరకు) వైకుంఠ ద్వార దర్శనం కోసం జనవరి 12, 13, 14, 15, 16, 17, 18 తేదీల్లో టోకెన్లు జారీ చేస్తారు.