రేపు దావోస్ పర్యటనకు వెళ్లనున్న సీఎం చంద్రబాబు

61చూసినవారు
రేపు దావోస్ పర్యటనకు వెళ్లనున్న సీఎం చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు ఆదివారం సాయంత్రం అమరావతి నుంచి దావోస్ ప్రర్యటనకు వెళ్లనున్నారు. సాయంత్రం 4 గంటలకు గన్నవరం నుంచి ఢిల్లీ చేరుకుంటారు. తరువాత ఢిల్లీ నుంచి జ్యూరిచ్‌కు చేరుకుని అక్కడి ఇండియన్ అంబాసిడర్‌తో భేటీ అవుతారు. అనంతరం హిల్టన్ హోటల్‌లో 10 మంది పారిశ్రామిక వేత్తలతో సమావేశమవుతారు. అనంతరం హోటల్ హయట్‌లో తెలుగు పారిశ్రామిక వేత్తలతో సమావేశంలో పాల్గొంటారు. తరువాత అక్కడ నుంచి 4 గంటల పాటు రోడ్డు మార్గంలో ప్రయాణించి చంద్రబాబు దావోస్ చేరుకుంటారు.

సంబంధిత పోస్ట్