ఇన్‌స్టాలో కొత్త ఫీచర్‌

65చూసినవారు
ఇన్‌స్టాలో కొత్త ఫీచర్‌
ప్రముఖ సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్‌ మరో కొత్త ఫీచర్‌తో ముందుకొచ్చింది. ఇకపై లైవ్‌స్ట్రీమ్‌ను కేవలం క్లోజ్‌ ఫ్రెండ్స్‌కు మాత్రమే అనుమతి ఇచ్చే ఆప్షన్‌ను తీసుకొచ్చింది. ‘క్లోజ్‌ ఫ్రెండ్స్‌ ఆన్‌ లైవ్‌’ పేరిట అందుబాటులోకి తెచ్చింది. క్లోజ్‌ ఫ్రెండ్స్‌ జాబితాలో యూజర్లు తమకు కావాల్సిన వారిని జత చేయడం లేదా తొలగించేందుకు అనుమతి ఉంటుంది. ఇప్పటివరకు ఇన్‌స్టా లైవ్‌ ఫాలోవర్లందరికీ కనిపించేది.

సంబంధిత పోస్ట్