టీ20 ప్రపంచ కప్‌లో భారత్ జోరు కొనసాగుతోంది. సూపర్-8లో భాగంగా రేపు రెండో మ్యాచ్ బంగ్లాదేశ్‌తో ఆంటిగ్వా వేదికలో ఆడనుంది. అయితే ఈ పిచ్‌ను అంచనా వేయడం చాలా కష్టం. లీగ్ స్టేజ్‌లో బౌలింగ్‌కు అనుకూలంగా మారిన పిచ్‌పై.. సూపర్-8లో మాత్రం బ్యాటర్లకు సహకారం లభిస్తోంది. గత యూఎస్‌ఏ-దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో తొలుత సఫారీ జట్టు 194/4 స్కోరు చేయగా.. యూఎస్‌ఏ కూడా 176/6 వరకు రాగలిగింది. అందుకు తగ్గట్టుగా భారత్ ప్రణాళిక రచిస్తోంది.