సీఎం జగన్ నామినేషన్ టైం ఫిక్స్?

543చూసినవారు
సీఎం జగన్ నామినేషన్ టైం ఫిక్స్?
ఏపీ సీఎం జగన్ ఈ నెల 22న నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఈ నెల 21న కుటుంబ సభ్యులతో కలిసి పులివెందులకు వెళ్లనున్న ఆయన.. 22న ఉదయం 10.30 గంటలకు నామినేషన్ దాఖలు చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా జగన్ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో సీఎం తరఫున పులివెందులలో వైఎస్ భారతి ప్రచార బాధ్యతలు తీసుకోనున్నట్లు సమాచారం. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆమె పులివెందులలోనే ఉండనున్నట్లు పార్టీ శ్రేణులు వెల్లడించాయి

సంబంధిత పోస్ట్