హంతకుల రక్షణలో జగన్ బిజీ: షర్మిల

50చూసినవారు
హంతకుల రక్షణలో జగన్ బిజీ: షర్మిల
వైఎస్ వివేకా హంతకులను సీఎం జగన్ రక్షిస్తున్నారని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. ‘వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి నిందితుడని సీబీఐ చెబుతోంది. కానీ తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ హంతకులను రక్షిస్తున్నారు. హంతకులను కాపాడడమే మీ న్యాయమా? సొంత చిన్నాన్నకు న్యాయం చేయలేరా? ప్రజలు నమ్మి అధికారం ఇస్తే.. హంతకులను వెనకేసుకొస్తారా?’ అని ఆమె విరుచుకుపడ్డారు.

సంబంధిత పోస్ట్