సీఎం జగన్ విధేయతతో కాకుండా రౌడీయిజంతో ఓట్లు అడుగుతున్నారని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అన్నారు. గిద్దలూరు సభలో ఆయన మాట్లాడుతూ.. "వైసీపీ హయాంలో కల్తీ మద్యం తాగి ఎంతో మంది చనిపోయారు. మా పార్టీకి ఈ సెగ్మెంట్‌లో బలం ఉన్నా రాష్ట్ర భవిష్యత్ కోసం టీడీపీకి సీటు త్యాగం చేశా. ఈ ఎన్నికల్లో సీఎం జగన్‌కు వెన్నులో భయం తెప్పించాలి. జగన్‌ను ఇంటికి పంపించాలి." అని పిలుపునిచ్చారు.