కొడాలి నాని నామినేషన్‌పై వివాదం

81చూసినవారు
కొడాలి నాని నామినేషన్‌పై వివాదం
కృష్ణా జిల్లా గుడివాడ అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని నామినేషన్‌పై వివాదం నెలకొంది. నామినేషన్‌లో తప్పుడు సమాచారం పెట్టారని రిటర్నింగ్ అధికారికి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. మున్సిపల్ కార్యాలయాన్ని క్యాంపు కార్యాలయంగా వినియోగించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. భవనాన్ని అద్దెకు ఇచ్చినట్లు అధికారులు ఇచ్చిన పత్రాలను దీనికి జత చేశారు. తప్పుడు సమాచారం ఇచ్చిన నాని అభ్యర్థిత్వాన్ని తిరస్కరించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్