ప్రస్తుత రాజకీయాలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విమర్శలు చేశారు. తాను మొదటి సారి పోటీ చేసినప్పుడు ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదని, ప్రజలే తనకు డబ్బులు ఇచ్చారన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతూ.. రాజకీయంలో నాయకులపై విమర్శలు చేసుకోవచ్చని, కుటుంబ సభ్యులను లాగడం సరికాదని వ్యాఖ్యానించారు. అలా చేసినందుకే గత రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు బుద్ది చెప్పారని పేర్కొన్నారు.