ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బెంగళూరు పర్యటనకు బయల్దేరి వెళ్లారు. కర్ణాటక అటవీశాఖ మంత్రి ఈశ్వర్ బి.ఖంద్రేతో సమావేశం కానున్నారు. కర్ణాటకలోని ఆరు కుంకీ ఏనుగులను రాష్ట్రానికి ఇవ్వాల్సిందిగా మంత్రిని పవన్ కోరనున్నారు. అలాగే ఎర్రచందనం స్మగ్లింగ్ కట్టడికి సహకరించాలని విజ్ఞప్తి చేయనున్నారు. కాగా ఏపీలోని చిత్తూరు, పార్వతీపురం ప్రాంతాల్లో ఏనుగుల గుంపును తరమడానికి కుంకీ ఏనుగులు అవసరం.