న్యూ ఇయర్ సందర్భంగా పేదలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దేశంలోని పేదలకు రూ.2 కోట్లకు పైగా ఇళ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాబోయే మూడు నెలల్లో దీనికి సంబంధించిన సర్వేను పూర్తి చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఈ విషయమై రాష్ట్రాలకు కేంద్రం సమాచారమిచ్చింది. మార్చి 31లోగా అర్హులను గుర్తించాలని ఆయా ప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది.