వైసీపీకి డిప్యూటీ మేయర్, నలుగురు కార్పొరేటర్ల రాజీనామా

561చూసినవారు
వైసీపీకి డిప్యూటీ మేయర్, నలుగురు కార్పొరేటర్ల రాజీనామా
నెల్లూరులో వైసీపీకి షాక్‌ తగిలింది. ఆ పార్టీకి నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్‌ రూప్‌కుమార్‌తో పాటు నలుగురు కార్పొరేటర్లు, మైనార్టీ నేతలు రాజీనామా చేశారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత, పార్టీలో నెలకొన్న పరిస్థితుల కారణంగానే గుడ్‌బై చెప్పినట్లు తెలుస్తోంది. రూప్‌కుమార్‌ మీడియాతో మాట్లాడారు. ‘‘వైసీపీ ఆవిర్భావం నుంచి సేవ చేశాను. తప్పనిసరి పరిస్థితుల్లో రాజీనామా చేస్తున్నాం‘ అని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్