YS జగన్‌పై సీఎం చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. 'తిరుమలకు జగన్ వెళ్లొద్దని ఎవరూ చెప్పలేదు. తిరుమల వెళ్లకుండా ఉండటానికి జగన్‌కు ఏ సాకులు ఉన్నాయో తెలియదు. నిన్ను తిరుమలకు వెళ్లొద్దని ఎవరైనా చెప్పారా? దేవుడి ఆచారాలు, సాంప్రదాయాలను ఎవరైనా గౌరవించి తీరాల్సిందే. అన్ని మతాలను గౌరవిస్తానన్న జగన్.. తిరుమలలో ఎందుకు నిబంధనలు పాటించరు? గతంలో జగన్ నిబంధనలు ధిక్కరించి తిరుమల వెళ్లారు' అని చంద్రబాబు అన్నారు.