సహజసిద్ధ మౌత్ ఫ్రెషనర్‌గానూ చాలామంది సోంపును వాడుతుంటారు. దీని వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇంట్లోనే సోంపు వాటర్‌ను తయారు చేసుకుని తాగడం ద్వారా దీని ఫలితాలను పొందవచ్చని పోషకాహార నిపుణులు అన్నారు. బరువు తగ్గడం నుంచి జీర్ణక్రియ, చర్మ ఆరోగ్యం వరకూ ఇది మన శరీర ఆరోగ్యానికి ఎంతగానో ఉపకరిస్తుంది. జీర్ణక్రియను కూడా సాఫీగా చేస్తుంది. అంతేకాదు ఈ వాటర్‌తో బరువు తగ్గే ప్రక్రియ సులువవుతుంది.