ఎండ ప్రభావం, వడగాల్పులతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఏప్రిల్, మే నెలల్లో మరింతగా ఎండ ప్రభావం ఉంటుందని వెల్లడించింది. మార్చిలో ఉత్తరాంధ్రలో ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటుందని, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా మిగిలిన చోట్ల సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.