ద్వారకా తిరుమల ఆలయంలో డ్రోన్‌ కెమెరా కలకలం

53చూసినవారు
ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో డ్రోన్ కెమెరా కలకలం సృష్టించింది. సోషల్ మీడియాలో శ్రీవారి క్షేత్ర డ్రోన్ విజువల్స్ హల్‌చల్‌ చేశాయి. ఆలయ భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవల ఒక యూట్యూబర్ పట్టపగలు క్షేత్రంపై డ్రోన్‌ ఎగురవేశారు. విజువల్స్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నిషేధిత ప్రాంతంలో డ్రోన్ ఎగురవేస్తుంటే అధికారులు, సిబ్బంది ఏం చేస్తున్నారంటూ భక్తులు మండిపడుతున్నారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్