బ్లాక్ కాఫీని రోజూ సేవించడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే రిస్క్ చాలా వరకు తగ్గుతుందని ఓ అధ్యయనంలో తేల్చారు. బ్లాక్ కాఫీని తాగితే ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. దీంతో శరీరం ఇన్సులిన్‌ను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకుంటుంది. ఫలితంగా షుగర్ లెవల్స్ తగ్గుతాయి. దీంతో డయాబెటిస్ అదుపులో ఉంటుంది. కనుక షుగర్ ఉన్నవారు రోజూ బ్లాక్ కాఫీని సేవిస్తుంటే మేలు జరుగుతుంది.