ఎన్టీఆర్‌ది మరణం లేని జననం: పురందేశ్వరి

54చూసినవారు
ఎన్టీఆర్‌ది మరణం లేని జననం: పురందేశ్వరి
AP: ఎన్టీఆర్‌ది మరణం లేని జననం అని మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. శనివారం విజయవాడలో ఎన్టీఆర్ విగ్రహానికి ఆమె నివాళులర్పించారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ.. ‘ఏ రంగంలోనైనా ఆ రంగానికే ఎన్టీఆర్ వన్నె తెచ్చారు. సినిమా చరిత్రకు కొత్త గుర్తింపు తెచ్చారు. రాజకీయాల్లోనూ తనకంటూ కొత్త చరిత్ర రాశారు. ఆంధ్రులకు ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. జన్మజన్మకు ఆయన కుమార్తెగానే పుట్టాలని కోరుకుంటున్నా.’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్