జగ్గంపేట: పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి అవి తేవద్దు
నన్ను అభిమానించే మీరు నా పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చేటప్పుడు పువ్వులు, బొకేలు, దండలు తీసుకురావద్దు అంటూ జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ విన్నవించారు. శుక్రవారం ఎమ్మెల్యే పుట్టినరోజు జగ్గంపేటలో భారీ ఏర్పాట్లు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఒక ప్రకటన చేశారు. మీరు వచ్చేటప్పుడు ఒక పుస్తకం, మొక్క కానీ తీసుకువస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుందని ఒక ప్రకటనలో తెలిపారు.