గోదావరి వరద మరింత పెరిగింది. సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత 2 గంటల సమయంలో తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 13. 75 అడుగులకు నీటిమట్టం చేరడంతో ఇరిగేషన్ శాఖ అధికారులు రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసారు. బ్యారేజ్ నుంచి 13,00, 261 క్యూసెక్కుల మిగులు జలాలు సముద్రంలోనికి విడుదల చేసినట్లు కాశీవిశ్వేశ్వరరావు ప్రకటించారు.