బాల దివ్యాంగుల హక్కుల పరిరక్షణకు వారికి సహకారాన్ని అందించాలని తూ. గో. జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ఛైర్మన్ గంధం సునీత సూచించారు. బుధవారం రాజమండ్రిలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయం వద్ద అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ఆమె సమావేశం నిర్వహించారు. బాల దివ్యాంగులకు విద్య, వైద్యం, ఆరోగ్యం పూర్తిస్థాయిలో అందించేందుకు తోడ్పాటు అందించాలని సూచించారు.