పులిని బంధించడానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నాం

77చూసినవారు
పులిని బంధించడానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నాం
రిజర్వు ఫారెస్టులో సంచరిస్తున్న చిరుత పులిని బంధించడానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నామని జిల్లా ఫారెస్టు అధికారి (ఇన్‌చార్జి) భరణి తెలిపారు. అభయారణ్యం ఆనుకొని ఉన్న ఆవాసాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నామని చెప్పారు. చిరుతపులి ప్రస్తుతం దివాన్‌చెరువు అటవీ ప్రాంతంలో మాత్రమే తిరుగుతుందని తెలిపారు. పులి జాడ కనుగొనేందుకు గత 13 రోజులుగా 100 ఫ్లాష్‌ కెమెరాలు, 7 ట్రాప్‌ కేజ్‌లు, 10 సీసీ కెమెరాల ద్వారా ప్రత్యక్షవీక్షణం చేస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్