రాజమండ్రి: మురళీధర్ రాజీనామా పట్ల విశ్వేశ్వరరెడ్డి స్పందన
రాజమండ్రి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష, రూరల్ ఇంచార్జ్ పదవులకు బాలేపల్లి మురళీధర్ రాజీనామా చేయడం పట్ల తూ. గో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టి. కె విశ్వేశ్వరరెడ్డి స్పందించారు. సోమవారం రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ.. మురళీధర్ యొక్క పరిస్థితులు తమకు తెలియవన్నారు. ప్రస్తుత రాజకీయం డబ్బుతో కూడుకున్నదని అన్నారు. అలాగే చిరంజీవి లాంటి వ్యక్తి పార్టీని నడపలేక మూసేసారని గుర్తు చేశారు.